శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక్లలో శేరిలింగంపల్లి డివిజన్ తెరాస కార్పొరేటర్‌గా మళ్లీ విజయం సాధించినందుకు గాను డివిజన్ తెరాస నాయకులు భీమినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాగం నాగేందర్ యాదవ్ ను సోమవారం ఘనంగా సన్మానించారు. ప్రజల మధ్యలో ఉండే నేతకు అపజయం ఉండదని రాగం నాగేందర్ యాదవ్ మరోసారి రుజువు చేశారని భీమినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు నర్సింగ్, అంబాదాస్, నరేంద్ర, కిరణ్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.
