వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్‌పల్లిలో జరిగిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బహిరంగ సభకు వివేకానందనగర్ నుంచి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లాయి. డివిజన్ బీజేపీ అభ్యర్థి ఉప్పల విద్యాకల్పన, నాయకుడు ఏకాంత్ గౌడ్‌ల ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున యోగి సభకు తరలి వెళ్లారు.
