శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ 109 డివిజన్ లోని సాయినగర్ కాలనీలోని రోడ్ల విస్తరణ పనులు, UGD పనులను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ పర్యవేక్షించారు. అక్కడున్న సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి కాలనీ వాసుల సమస్యలను వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, సంబంధిత అధికారులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.