శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): పిల్లలపై చదువు ఒత్తిడిని తగ్గిస్తూ క్రీడా స్ఫూర్తి, సామాజిక, ఆరోగ్య పరమైన శరీర అభివృద్ధిని పెంపొందించే దిశగా విద్యాలయాలు కృషి చేయాలని టీపీసీసీ కో ఆర్డినేటర్ సామెల్ కార్తీక్ ఎంఈవోకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఎంఈవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోను జారీ చేసిందని, అయినప్పటికీ అనేక స్కూళ్లు పిల్లలను క్రీడలకు, మానసిక విరామానికి దూరం చేస్తూ వారి స్కూల్ బ్రాండింగ్ కోసం పిల్లలపై చదువు ఒత్తిడిని చేస్తున్నారని అన్నారు. పిల్లల భవిష్యతు, మానసిక ఆరోగ్యం దృష్ట్యా నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి NSUI విభాగం నాయకులు పాల్గొన్నారు.