శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి విశ్వకర్మ ఫౌండేషన్ ప్రతినిధులు ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని విశ్వకర్మ జాతీయులకు సమావేశాల నిర్వహణకు సామాజిక భవనం కేటాయించాలని, వృత్తి నిపుణులకు శిక్షణ, భృతి ఇవ్వాలని, సభ్యులకు బీమా సౌకర్యం కల్పించాలని, విదేశీ విద్యాభ్యాసం చేసే వారికి ఆర్థిక సహాయం అందించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత కల్పించాలని, తమ కుల వృత్తులను 4 ఉప కులలుగా పరిగణిస్తున్నారని, ఉపకులాలను తొలగించి తమ జాతీయులను ఒకటే కమ్యూనిటీగా గుర్తించాలని ప్రభుత్వ విప్ గాంధీని కోరారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఆయా సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, చందానగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, విశ్వకర్మ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర చారి, శేరిలింగంపల్లి కమిటీ సభ్యులు శంకర చారి, రాము, రామా చారి, సత్యం చారి, వెంకట చారి, మాధవ చారి, మల్లేశం చారి, సీఐ ఇంటలిజెన్స్ మాధవరావు, దేవేంద్ర చారి పాల్గొన్నారు.