నమస్తే శేరిలింగంపల్లి: మంచిగా ఉన్న రోడ్లను డ్రైనేజీ పైప్ లైన్ల పేరుతో తవ్వి కనీసం గుంతలు పూడ్చకుండా, ప్యాచ్ వర్క్ లు వేయకుండా వదిలి వేయటంతో కాలనీ రోడ్లన్నీ గుంతలతో బురదమయమై అధ్వాన్న స్థితికి చేరాయని బిజెపి నాయకులు పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ వేమన రెడ్డి కాలనీలో చందానగర్ డివిజన్ బిజెపి ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు బురదమయమైన రోడ్లపై వరినాట్లు వేస్తూ వినూత్న నిరసన తెలిపారు. కాలనీలో రోడ్లన్నీ బురదమయంగా మారడంతో వాహనదారులు ప్రతి నిత్యం ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలనీ వాసులు నడవలేని పరిస్థితిలో ఉన్నా పట్టించుకునే నాధుడే లేడని వాపోయారు.
కాలనీ వాసులు తమ ఇబ్బందులను పరిష్కరించాలని పలుమార్లు అధికారులు ప్రజాప్రనిధులతో మెర పెట్టుకున్న ఇటు వైపు కన్నెత్తి చూడడం లేదన్నారు. ఇలాంటి కాలనీలు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చాలా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి దెబ్బతిన్న రోడ్లను బాగుచేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు మువ్వ సత్యనారాయణ, రవి కుమార్ యాదవ్, కసిరెడ్డి సింధు రెడ్డి, ఎల్లేశ్, చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, కాలనీ వాసులు గోవర్ధన్ రెడ్డి, మల్లా రెడ్డి, రాంరెడ్డి, వెంకట్ రెడ్డి, చైతన్య రెడ్డి, రవికాంత్ రెడ్డి, బీజేపీ నాయకులు నాగులు గౌడ్,రాకేష్ దూబే, నర్సింహా రావు, పంతులు, కసిరెడ్డి రఘు, సురేష్, శ్రీను, లలిత, సైఫుల్లాఖాన్, జీ ఎన్ రెడ్డి, పోచయ్య, అనంత రెడ్డి, గౌస్, శ్రీకాంత్ యాదవ్, రమణకుమారి, శోభ, కల్పన, జంగయ్య, శ్రీనివాస్ ముదిరాజ్, అర్జున్ రావు, శివరత్నాకర్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.