నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని విద్య వాణి హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. 2003వ సంవత్సరంకు చెందిన 10వ తరగతి విద్యార్థులు మిత్రులు అందరు ఒక్కచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఆటాపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న స్కూల్ కరెస్పాండంట్ కజ్జం అనిల్ కుమార్‌కు దంపతులకు విద్యార్థులు పట్టు వస్త్రాలు సమర్పించి ఆశీర్వాదాలు పొందారు. తన పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ జీవితంలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకొని ఆనిల్‌కుమార్ ఆనందాన్ని వ్యక్త పరిచారు. జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులను దీవించారు.
