సీపీఐ శేరిలింగంప‌ల్లి మండ‌ల కార్య‌ద‌ర్శిగా టి.రామ‌కృష్ణ‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: భార‌త క‌మ్యూనిస్ట్ పార్టీ(సీపీఐ) శేరిలింగంప‌ల్లి మండ‌ల కార్య‌ద‌ర్శిగా టి.రామ‌కృష్ణ నియ‌మితుల‌య్యారు. ఆదివారం జ‌రిగిన ముఖ్య కార్య‌వ‌ర్గ స‌మావేశంలో జిల్లా కార్య‌ద‌ర్శి పాల‌మాకుల జంగ‌య్య ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక స‌మ‌స్య‌లపై ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. అనంత‌రం రామ‌కృష్ణ‌ను శేరిలింగంప‌ల్లి మండ‌ల కార్య‌ద‌ర్శిగా ఆయ‌న ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వ త‌ప్పిదాల‌ను ఎత్తిచూపుతూ పోరాటాల‌కు సిద్ధ‌మ‌వ్వాల‌ని మండ‌ల పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు. నూత‌న కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ మాట్లాడుతూ త‌నపై న‌మ్మ‌కముంచి భాద్య‌త‌లు అప్ప‌గించిన జిల్లా కార్య‌ద‌ర్శి పాల‌మాకుల జంగ‌య్య‌, కార్య‌వ‌ర్గానికి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. శేరిలింగంప‌ల్లిలో పార్టీ ఎదుగుద‌ల‌కు శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ జిల్లా కౌన్సిల్ స‌బ్యులు కె.న‌ర్సింహారెడ్డి నాయ‌కులు చందుయాద‌వ్‌, లింగ‌య్య‌, కృష్ణ‌, విన‌య్‌గౌడ్‌, వెంక‌ట‌స్వామి, రాములు, కుమార్‌, చెంచ‌మ్మ‌, ర‌వి, ఆంజ‌నేయులు, సురేష్‌, శ్రీనివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

స‌మావేశంలో మాట్లాడుతున్న జిల్లా కౌన్సిల్ స‌భ్యులు పాల‌మాకుల జంగ‌య్య‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here