శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో ఆరవ రోజు వసంత నవరాత్రుల సందర్భంగా సిరి మువ్వ నృత్య నికెతన్ డాన్స్ మాస్టర్ R. సుధీర్ బాబు శిష్య బృందం నృత్య ప్రదర్శనతో అలరించారు. తమ నృత్య ప్రదర్శనతో అందరిని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా క్షేత్రం వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి కళాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.