చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కాలనీకి చెందిన ఎ.మీనా ఆధ్వర్యంలో కాలనీవాసులు సోమవారం డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. తనకు ఓటు వేసిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి కాలనీ, బస్తీలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సునీత, అంబిరామ్, డి.జయ, వనిత, డి.జయ, పుష్ప, రఘు, ఐలయ్య, మీనా.బి, కుసుమ, తేజస్వి,శేఖర్ పాల్గొన్నారు.
