చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా నమక చమక సహిత మహాన్యాస పూర్వక ఏకాదశ పంచామృత మహా రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పూజల్లో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.


