నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీ లో స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి, డీసీ సుదాంష్తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మొక్కలను నాటారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు, లక్ష్మీ నారాయణ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మిరియాల రాఘవ రావు, వెంకటేశం, జనార్దన్ రెడ్డి, దాసరి గోపి, కరుణాకర్ గౌడ్, అక్బర్ ఖాన్, గుడ్ల ధనలక్ష్మి, ఓ.వెంకటేష్, మిరియాల ప్రీతమ్, పారునంది శ్రీకాంత్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి , హరీష్, దాస్, ఎల్లమయ్య, యశ్వంత్, కొండల్ రెడ్డి, జహీర్ ఖాన్, ప్రవీణ్ ,రఘునందన్, భవాని చౌదరీ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.
