నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం లో భాగంగా శనివారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజీలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ సుధాంష్, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజిత జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్ నీరజ గాంధీ, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, వార్డ్ సభ్యులు గుమ్మడి శ్రీనివాస్, నాయకులు యాదాగౌడ్, సాయి, శ్యామ్, లోకేష్, నిఫ్ట్ యూనివర్సిటీ డైరెక్టర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.