వ‌ర్షాకాల వ్యాదుల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న దొంతి స‌త్య‌నారాయ‌ణ గౌడ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ప్ర‌ముఖ‌ సామాజిక కార్య‌క‌ర్త‌, చందాన‌గ‌ర్‌ వేముకుంట శ్రీ వేణుగోపాల స్వామి దేవాల‌య చైర్మ‌న్‌ దొంతి స‌త్య‌నారాయ‌ణ గౌడ్ వ‌ర్షాకాల వ్యాదుల‌ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాడు. ప్ర‌చార ర‌ధాన్ని ఏర్పాటు చేసి వాడ‌వాడ‌ల వాడ‌వాడ‌ల అవ‌గాహ‌ణ కార్య‌క్ర‌మాల‌ను నిర్వాహిస్తున్నాడు. శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్ 20 ఎంట‌మాల‌జీ సిబ్బంది స‌హ‌కారంతో ఇంటింటికి వెళ్లి మలేరియా, ఫలేరియా, మరియు డెంగ్యూ వ్యాదుల నివారణపై పూర్తి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు.

దొంతి స‌త్య‌నారాయ‌ణ గౌడ్‌ ఏర్పాటు చేసిన ప్ర‌చార ర‌ధంతో శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్ ఎంట‌మాల‌జీ సిబ్బంది

అదేవిధంగా దొమ‌ల నివార‌ణ‌కు సంబంధించిన మందుల‌ను పంపిణీ చేస్తూన్నారు. ఈ క్ర‌మంలోనే శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్ 20 ప‌రిధిలోని రాజీవ్ గృహకల్ప, సురభి కాలనీ, డొయేన్స్ టౌన్ షిప్ త‌దిత‌ర ప్రాంతాలలో నివారణ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సహాయ ఏంటోమోలోజిస్ట్ కిరణ్, సహాయ ఇంజనీర్ సునీల్, ఏంటోమోలజీ సిబ్బంది పాల్గొన్నారు.

దొంతి స‌త్య‌నార‌య‌ణ గౌడ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here