నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీలలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్, ఓయూ ప్రొఫెసర్ కాలనీ, కొత్తగూడ విలేజ్, కొండాపూర్ విలేజ్ మెయిన్ రోడ్లలో రూ. 2.25 కోట్ల నిధుల అంచనా వ్యయంతో చేపట్టిన యూజీడీ పనులకు స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ కొండాపూర్ డివిజన్ పరిధిలో కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టటం జరుగుతున్నదని, నూతన డ్రైనేజీ, సరికొత్త రహదారులు, తదితర మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. కొండాపూర్ డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ, రహదారులు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరిత గతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ రావు, మాజీ కార్పొరేటర్ రవిందర్ ముదిరాజ్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు అబ్బుల కృష్ణగౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు అన్నం శశిధర్ రెడ్డి, చాంద్ పాషా, రాజు యాదవ్, పేరుక రమేష్ పటేల్, కె. నిర్మల, రూప రెడ్డి, జంగం గౌడ్, శ్రీనివాస్ చౌదరి, బాల్ రెడ్డి, రాజేష్ యాదవ్, నరేష్ ముదిరాజ్, తాడెం మహేందర్, మంగళరపు తిరుపతి , రజనీకాంత్, తిరుపతి యాదవ్, సైబర్ హిల్స్ భాస్కర్ రెడ్డి, నీలం మధు, నీలం రఘు, లక్ష్మి నారాయణ, కుమార్, డా రమేష్, మంగమ్మ, లావణ్య, గిరి గౌడ్, యాదగిరి, నందు, గణపతి, ప్రభాకర్, స్వామి గౌడ్, సత్యం గౌడ్, సయ్యద్ ఉస్మాన్, తిరుపతి రెడ్డి, రమేష్, మధు, దీపక్, కరీం, వివి రావు, షేక్ రఫీ, ఖాసిమ్, అంజాద్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.