నమస్తే శేరిలింగంపల్లి: వరకట్న వేధింపులు తాళలేక నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మౌనిక తెలిపిన వివరాల ప్రకారం… నాగర్‌కర్నూల్‌కు చెందిన రాహుల్ అలియాస్ మున్నకు ఏ.సోని(20)తో కలసి ఈ ఏడాది జనవరి 8న వివాహం జరిగింది. వారు మియాపూర్ నడిగడ్డ తండాలో నివాసం ఉంటున్నారు. మున్నా స్థానికంగా బైక్ మెకానిక్‌గా విధులు నిర్వహిస్తుండగా సోని గృహిణి. ఐతే సోని శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మున్న వరకట్నం తీసుకురావాలంటూ సోనినీ తరచూ వేధించేవాడని, ఈ క్రమంలోనే మనస్థాపం చెంది సోని ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవఖానకు తరలించారు.