నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని అపర్ణ సైబర్లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్‌రెడ్డి ఆదివారం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. దీంతో డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి ట్యాంకర్ల ద్వారా హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. అపర్ణ సైబర్ లైఫ్‌లోని అన్ని బ్లాక్‌లలో అడుగడుగున కరోనా క్రిమి సంహారక మందును స్ప్రే చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి మాట్లాడుతూ కరోన ఉదృతి నేపథ్యంలో అపర్ణ సైబర్ లైఫ్ వాసులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, అవసరం ఐతే తప్ప బయటకి రావద్దని సూచించారు.