శేరిలింగంపల్లి, జనవరి 17 (నమస్తే శేరిలింగంపల్లి): RSS 100 వసంతాల సందర్భంగా హఫీజ్‌పేట డివిజన్ హుడా కాలనీలో RSS సేవకుడు డి.రాధాకృష్ణ, హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల ఆధ్వర్యంలో నిర్వహించిన బొమ్మల కొలువును రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి తిలకించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ఇలాంటి కార్యక్రమాలు అవసరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మూల అనిల్ గౌడ్, హఫీజ్ పేట డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్, బీజేపీ సీనియర్ నాయకులు Dr. అజిత్ సేనాపతి , నరసింహారావు, బీజేపీ నాయకులు పవన్ , సురేష్ కురుమ , రాజు యాదవ్ , రాంరెడ్డి , శ్రీనివాస్ , ప్రభాకర్ రెడ్డి , పవన్ కుమార్ , రామక్రిష్ణ , బీజేవైఎం నాయకులు శివ కుమార్ , వివిధ మోర్చాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






