నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా క్రిస్మస్ పండగ సందర్భంగా శనివారం సందర్శకులతో కిటకిటలాడింది. చేనేత హస్త కళ ఉత్పత్తులను ఎంతో ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. ఆహ్లాదమైన వాతావరణం లో పిల్లలు పెద్దలు స్టాల్స్ ను సందర్శించారు. సాయంత్రం బెంగళూరు నుండి విచ్చేసిన కళాకారులు డాక్టర్ సాధన శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. ప్రదర్శనలో భాగంగా వీరు స్వరవాలి, దేవర్ణమా, ఇదు బృందావన, ఎనీ మహానందవే, పురందరదాసు కీర్తన, ఎన్ను పిల్లలే గోపి, అతి నిరుపమా సున్దరాకార, కళింగ తిల్లాన, కృష్ణాకర్ణ – బాల మురళి కృష్ణ రచించిన తిల్లాన అంశాలను ప్రదర్శించారు. కుమారి సుమనా, నవ్య, రంజాన్, పవిత్ర ప్రియా, కావ్య శ్రీ, సృష్టి జోషి, కీర్తన విజయ్ లు ప్రదర్శించి మెప్పించారు.

