నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరీనగర్‌లో నిరుపయోగంగా ఉన్న మోడల్ మార్కెట్, వార్డ్ కార్యాలయంలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా కోవిడ్ ఐసోలేషన్ కేంద్రంగా ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం మోడల్ మార్కెట్ల పేరుతో 2016-17 లో ప్రతిష్టాత్మకంగా యాక్షన్ ప్లాన్ వేసి నెలల వ్యవధిలో 38 మోడల్ మార్కెట్ల నిర్మాణం పూర్తి చేసింది కానీ అవి ప్రజలకు జన సంచరంలేని ప్రాంతాలలో కట్టడం వల్ల వ్యాపారులు ఎవరు అక్కడా వ్యాపారాలు నడపడానికి ఆసక్తి చుపెట్టక పోవడంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలోనే మియాపూర్ మయూరి నగర్‌లో నిర్మించిన మోడల్ మార్కెట్ సైతం వాడుకలో లేకపోవడం బాదాకరమని అన్నారు. లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాలు ప్రారంభానికి ముందే శిధిలావస్థకు చేరుకోవడం ప్రజాధనాన్ని వృధా చేయడమే అని అన్నారు. ప్రస్థుత కరోనా విపత్కర పరిస్థితుల్లో మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరీనగర్‌లో నిరుపయోగంగా ఉన్న వార్డు కార్యాలయం, మోడల్ మార్కెట్ భవనాలను ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాగా లేదా కోవిడ్ ఐసోలేషన్ కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌లు దృష్టి సారించి మియాపూర్ డివిజన్ ప్రజలకు మేలు జరిగేలా చూడాలని పల్లే మురళి కోరారు.
