నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చిన తెలంగాణ రైతు గోస – బిజెపి పోరు దీక్ష శేరిలింగంపల్లిలో విజయవంతం అయ్యింది. ఈ క్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, బిజెపి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, రాష్ట్రనాయకులు, జిల్లా పరిషత్ మాజీ వైస్‌చైర్మన్ నందకుమార్ యాదవ్, రాష్ట్రనాయకులు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జీ గజ్జల యోగానంద్, బిజెవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కసిరెడ్డి సింధు రఘునాథ్‌రెడ్డి, మాదాపూర్ డివిజన్ ఇన్చార్జీ రాధకృష్ణయాదవ్, వివేకానందనగర్ డివిజన్ ఇన్చార్జీ ఉప్పల విద్యాకల్పన ఏకాంత్ గౌడ్‌లు, సంగారెడ్డి జిల్లా నుంచి బిజెపి రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ డి.సతీష్‌గౌడ్, బిజెవైఎం ఊరేళ్ల మహేష్ యాదవ్, రైతుగోస కార్యక్రమంలో భాగంగా వారివారి ఇళ్లలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సోమవారం నిరసన ధీక్ష చేపట్టారు.

ఈ సంద్భర్భంగా బిజెపి నేతలు మాట్లాడుతూ.. రైతుబంధు, రైతు భీమా అమలు చేయటంలో సీఎం కెసిఆర్ పూర్తిగా విఫలమయ్యారని మండి పడ్డారు. కేంద్ర పధకాలు తెలంగాణ కర్షకులకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వ అడ్డుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కష్టపడి పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధ్యాన్యన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని దుయ్యాబట్టారు. కరోనా మహమ్మారీ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో రుణ మాఫీ చేయకుండా తాత్సరం చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో బీజేపీ అధికారం లోకి రాగానే ప్రతీ రైతు, కూలీకి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు.









