నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లి విలేజ్‌లో నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ, వరద నీటి కాలువ నిర్మాణ పనులను జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో కలసి స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ, వరదనీటి కాల్వల నిర్మాణంతో గోపన్‌పల్లి ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని అన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం సంధ్య రాణి, జీహెచఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ డీఈ శ్రీనివాస్, ఏఈ కృషవేణి, వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాధ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
