సూపర్‌స్ప్రెడ‌ర్ వ్యాక్సినేషన్‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది: ర‌వికుమార్ యాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: నియోజకవర్గ పరిధిలో గ‌చ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ హాల్, కుక‌ట్‌ప‌ల్లి హెచ్ఎంటీ కాలనీల్లో కొన‌సాగుతున్న కోవిడ్ సూప‌ర్ స్ప్రెడ‌ర్స్ వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల‌ను బిజెపి రాష్ట్ర‌ నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డిలు మంగ‌ళ‌వారం సందర్శించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ సెంటర్లలో అరకొర సదుపాయాలు ఉన్నాయని, ప్రజలకు వ్యాక్సినేష‌న్‌పై అవగాహన కల్పించడంలో రాష్ట్ర‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో ప్రజలకు తప్పుడు లెక్కలు చూపుతూ పబ్బం గడుపుతున్న ఈ ప్రభుత్వం ప్రజలకు బురిడీ కొట్టిస్తిందుని అన్నారు. సూపర్ స్పైడర్ ఎవరో, వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు ఎవ‌రో తెలియజేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా అధికారులు వ్యాక్సినేషన్ సెంటర్లను సందర్శించి సరైన వసతులు కల్పించాలని, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సెకండ్ డోస్ ఎప్పుడు, ఎక్కడ ఇవ్వాలో ప్రజలకు క్లుప్తంగా వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ బిజెపి కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, బిజెపి రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చ అధ్య‌క్షులు హ‌న్మంత్‌నాయ‌క్‌, నాయకులు ఉప్పల ఏకాంత్ గౌడ్, సీతారామరాజు, చారి, ఆంజనేయులు యాదవ్, మహేష్, గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంధ్య క‌న్వెన్ష‌న్ వ్యాక్సినేష‌న్ సెంట‌ర్‌లో శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్ ఉప‌క‌మిష‌న‌ర్ తేజావ‌త్ వెంక‌న్న‌తో మాట్లాడుతున్న ర‌వికుమార్యాద‌వ్‌, గంగాధ‌ర్‌రెడ్డి, రాధ‌కృష్ణ యాద‌వ్‌లు
హెచ్ఎంటీ కాల‌నీలో వ్యాక్సినేష‌న్ సెంట‌ర్‌ను ప‌రిశీలిస్తున్న ర‌వికుమార్ యాద‌వ్‌, గంగాధ‌ర్‌రెడ్డి, ఏకాంత్‌గౌడ్‌, రాధ‌కృష్ణ యాద‌వ్‌

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here