నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ ఫేజ్ 1లో కొనసాగుతున్న నాలా విస్తరణ
పనులను ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ ఖాయిదమ్మ కుంట చెరువు నుండి సితార హోటల్ వరకు రూ.8.00 కోట్ల నిదులతో చేపడుతున్న నాల విస్తరణ పనులు పెండింగులో ఉండటనం సరకాదని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆయన సూచించారు. వర్షాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపధకన పనులు చేపట్టాలని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వర్షాకాలంలో ఎదురయ్యే పరిస్థితులను తట్టుకునేలా పక్క ప్రణళికతో ముందుకు సాగాలని అన్నారు. ఎన్నో ఏళ్లుగా జనప్రియ పరిసర ప్రాంతాలు వరద ముంపుతో సతమతమయ్యేవని, ఇటీవల కొంత మార్పు వచ్చినా శాశ్వత పరిష్కారం లభించాల్సి ఉందని, అందుకు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్స్ విభాగం సమన్వయంతో కలసి పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు డీఈ హరీష్, ఏఈ శివ కృష్ణ టీఆర్ఎస్ హఫీజ్‌పేట్ డివిజన్ అధ్యక్షులు గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు శాంతయ్య, రవి కుమార్, సురేష్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
