మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని జయ ప్రకాష్ నారాయణ్ నగర్ కాలనీ వాసులు స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను ఆదివారం ఘనంగా సన్మానించారు. జిహెచ్ఎంసి కౌన్సిల్ సభ్యుడిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కు జెపిఎన్ నగర్ కాలనీ వాసులు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకు వచ్చారు. సానుకూలంగా స్పందించిన ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు అన్నెె రాజు, రామాంజనేయరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాఘవరావు, వాసు, రామ సుబ్బారెడ్డి, మాధవి, శిరీష, రూపాలత, కమల, కాలనీ వాసులు పాల్గొన్నారు.
