కార్పొరేటర్ ఉప్పలపాటిని కలిసిన సత్యలక్ష్మి నగర్ వాసులు

నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా చూడాలని సత్య లక్ష్మీ నగర్ కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మియపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను మంగళవారం సత్యలక్ష్మీ నగర్ అసోసియేషన్ సభ్యులు కలిసి వినతి పత్రం అందజేశారు. కాలనీ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు బాలు చౌదరి, రమణ, ఈశ్వర్ నాయుడు, రామిరెడ్డి, శ్రీధర్, రాణి, నరేష్, సాంబయ్య, బిఆర్ చౌదరి, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను కలిసిన సత్యలక్ష్మీ నగర్ అసోసియేషన్ సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here