వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ బాగ్ అమీర్ వాసి ఉప్పల రాజేశ్వర్ గౌడ్, నాగమణి దంపతులు అయోధ్య భవ్యరామ మందిర నిర్మాణం కోసం రూ.51వేల నిధిని RSS సికింద్రాబాద్ విభాగ్ ప్రచారక్ యాదిరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి జిల్లా భౌద్ధిక్ ప్రముఖ్ పవన్, నామాల శ్రీనివాస్, ఉప్పల ఏకాంత్ గౌడ్, ఉప్పల శ్రీకాంత్ గౌడ్, ఉప్పల మహేష్ గౌడ్ పాల్గొన్నారు.