నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కేఫ్ నుండి చందానగర్ గాంధీ విగ్రహం వరకు రూ.1కోటి 80లక్షలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను గురువారం స్థానికులతో కలిసి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. హఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌళికవసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శేఖర్ ముదిరాజ్, నాయకులు రాజేందర్, భగత్, హఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కంది జ్ఞానేశ్వర్, విష్ణు, వర్క్ ఇన్ స్పెక్టర్లు మల్లేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.






