అంతరించిపోతున్న కళలను ఆదరించుదాం – వివేకానంద సేవ సమితి గౌరవ అధ్యక్షులు జ్ఞానేంద్ర ప్రసాద్

నమస్తే శేరిలింగంపల్లి: అంతరించిపోతున్న ప్రాచీన జానపద కళలను, కళారూపాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బిజెపి రాష్ట్ర నాయకులు, వివేకానంద సేవ సమితి గౌరవ అధ్యక్షుడు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. వివేకానంద నగర్ డివిజన్ దీనబంధు కాలనీ వద్ద నెహ్రూ యువ కేంద్ర, స్వామి వివేకానంద సేవ సమితి సంయుక్తంగా జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఎన్ వై కె సమన్వయ కర్త కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో విజేతలకు బిజెపి రాష్ట్ర నాయకులు, సేవ సమితి గౌరవ అధ్యక్షులు జ్ఞానేంద్ర ప్రసాద్, ఎన్ వై కె అధికారి ఇజయ్య పాల్గొని బహుమతులను, భగవద్గీతను అందజేశారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మరుగున పడుతున్న పల్లె ప్రకృతి అందాలను, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశంలో విభిన్న రాష్ట్రాలలో విభిన్న ఆచారాలు ఉన్నప్పటికీ ఆ ఆచార పద్ధతులను కళ్ళకు కట్టినట్టు చూపించేదే జానపదం అన్నారు. నృత్యాలు మనిషి శారీరకంగా దృఢత్వాన్ని పెంచుకొని ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయని అన్నారు. కుమార్ యాదవ్ మాట్లాడుతూ విదేశీ విష సంస్కృతి కరోనా వైరస్ కంటే ప్రమాదమైనదని అన్నారు. విష సంస్కృతి కోరల్లో యువత చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉద్యమాలకు ఊపిరి పోసేది సాహిత్యాలే అన్నారు. సాహిత్యాలు దొరలకు దాసోహం కాకుండా సమాజ హితం కోసం పని చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీ వేద ధార్మిక సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమాచార్యులు, వివేకానందనగర్ డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ రావు, బాలు యాదవ్, శ్రీకాంత్ యాదవ్, రాజా మీసా, డాన్స్ మాస్టర్ అఖిల్, కళ్యాణ్, కవిత, సాహితిసృతి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతులను అందజేస్తున్న జ్ఞానేంద్ర ప్రసాద్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here