నమస్తే శేరిలింగంపల్లి: ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యునిగా ఎన్నికైన తాత మధుసూదన్ గురువారం శాసనమండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శాసన మండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమిన్యుల్ హసన్ జాఫ్రీ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, హరిప్రియ నాయక్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.