రూ. 2 కోట్ల వ్యయంతో కొండాపూర్ డివిజన్ లో యూజీడీ పనులకు శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు అభివృద్ధి పనుల్లో ఎక్కడా ఆటంకం‌ లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ, బి బ్లాక్ ల్లో రూ‌. 2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న యూజీడీ పైపులైన్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో మంత్రి కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లి నియోజకర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా కొండాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఏఈ జగదీష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ, మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు అబ్బుల కృష్ణ గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, నాయకులు పేరుక రమేష్ పటేల్, బలరాం యాదవ్, జంగం గౌడ్, తిరుపతి, శ్రీనివాస్ చౌదరి, రూప రెడ్డి, మీనా భి, అడ్వకేట్ కృష్ణవేణి, తిరుపతి యాదవ్, హిమామ్, సయ్యద్ ఉస్మాన్, నరేష్ ముదిరాజ్, అంజి, మాల సుధాకర్, లక్ష్మి నారాయణ, కుమార్, స్వామి సాగర్, లక్ష్మణ్, ఎల్లయ్య, గిరి గౌడ్, వెంకట్ రెడ్డి, అబేద్ అలీ, నాయుడు, శ్రీను, మంగలి కృష్ణ, సంతోష్, కుమార్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, యాదగిరి, శ్యామల, ప్రభాకర్, సాయి శ్యామ్యూల్ కుమార్, ఖుర్షిదా బేగం,కురుమయ్య, యాస్మిన్ బేగం, పాషా, జలీల్, బాబురావు, షైనాజ్, ఈరమ్మా, సాబేరా బీ, మాధవ్ రావు, నసీర్,స్వప్న, దీపక్, కరీం, జహంగీర్, వసీమ్ కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

కొండాపూర్ డివిజన్ లో యూజీడీ పనులకు శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here