నమస్తే శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మై హోమ్ మంగళవద్ద, నెహ్రు నగర్, బాపు నగర్, గోపి నగర్ కాలనీ లలో రూ.2 కోట్ల 53 లక్షల రెండు కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న వరద నీటి కాలువ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ యూజీడీ పునరుద్ధరణ, వరద నీటి కాలువ నిర్మాణ పనులను, అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని సూచించారు. మై హోమ్ మంగళ వద్ద కోటి యాబై ఐదు లక్షల అంచనావ్యయం తో వరద నీటి కాలువ నిర్మాణ పనులకు, నెహ్రూ నగర్, బాపు నగర్, గోపి నగర్ కాలనీ లలో రూ.98 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టనున్న యూజీడీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి వర్క్ ఇన్‌స్పెక్టర్ యాదగిరి, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, నాయకులు చింతకింది రవీందర్ గౌడ్, పొడుగు రాంబాబు, కృష్ణ యాదవ్, నాగేష్ గౌడ్, యాదాగౌడ్, ప్రసాద్, గోపాల్, రమణి, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.
