నమస్తే శేరిలింగంపల్లి:తెలంగాణ రాష్ట్ర సాధన లో కలిసి ఉద్యమం చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉద్యమకారులు సమావేశమయ్యారు. మంగళవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని కృష్ణ కాలనీలో విజయలక్ష్మీ నర్సింగ్ రావు నివాసంలో ఉద్యమకారులు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అప్పటి స్థితిగతులను నెమరువేసుకున్నారు. ఉద్యమకారులం ఏకతాటిపై ఉండి బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ అభివృద్ధికి పాటు పడాలన్నారు. సంగారెడ్డి, నిమ్మల శేఖర్ గౌడ్, షేక్ జమీర్, మిద్దెల మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.