TSUWJ నుండి TUWJ లోకి వలసలు

  • జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న టీయూడబ్ల్యూజే..
  • శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో జర్నలిస్ట్ నాయకులు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న యూనియన్ టీయూడబ్ల్యూజే అని యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు అభిప్రాయపడ్డారు. టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో గతంలో ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున నిధులను తీసుకువచ్చి జర్నలిస్టుల సంక్షేమం కోసం వెచ్చించిన ఘనత టీయుడబ్ల్యూజేదని అన్నారు. శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం నియోజకవర్గ పరిధిలోని చందానగర్ లో నిర్వహించారు. చందానగర్ లోని పీజెఆర్ స్టేడియంలో నిర్వహించిన ఈ సమావేశానికి టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పైళ్ల విఠ‌ల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్ లు హాజరయ్యారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న ఉప్ప‌రి శేఖ‌ర్ సాగ‌ర్

శేరిలింగంపల్లి మండల పరిధిలోని దాదాపు 120 మంది జర్నలిస్టులు పాల్గొన్న ఈ సమావేశంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టులను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగస్వాములను చేసి రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఘనత టీయూడబ్ల్యూజేద‌ని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ సారథ్యంలో జర్నలిస్టుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అక్రిడేషన్ కార్డుల కంటే ప్రత్యేక రాష్ట్రంలో రెండింతల కార్డులను జారీ చేయించిన ఘనత టీయూడబ్ల్యూజేదని అన్నారు. జర్నలిస్టుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్ కార్డులను సాధించిన విషయాన్ని గుర్తు చేశారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న జ‌ర్న‌లిస్టులు

టీయూడబ్ల్యూజేను విమర్శించే ఇతర యూనియన్లు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయి నిధులను రాబట్టాలని సవాలు విసిరారు. శేరిలింగంపల్లి మండల పరిధిలో దశాబ్దాలుగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న సొంతింటి కలను సాకారం చేసేందుకు ముందుకు వచ్చిన టీయూడబ్ల్యూజే, అందుకు అనుగుణంగా నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చందానగర్ లోని సర్వేనెంబర్ 174లో ఒక ఎకరం స్థలాన్ని మంజూరు చేయించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. దీంతోపాటు ఈ భూమి పక్కనే ఉన్న సర్వే నెంబర్ 152లోని మరో 1 ఎకరం స్థలాన్ని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని టీయూడబ్ల్యూజే తీవ్ర ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి గత ఫిబ్రవరిలో వినతి పత్రం సమర్పించి సదరు స్థలం కోసం క్రమం తప్పకుండా ఎమ్మెల్యే, అధికారులు, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకు వెళుతున్నామని అన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ప్రభుత్వ పెద్దలు, అధికారుల సహకారంతో త్వరలోనే జర్నలిస్టుల సొంతింటి కలను పూర్తిస్థాయిలో సాకారం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

టీయూడబ్ల్యూజే లో చేరిన పలువురు సీనియర్ జర్నలిస్టులు..

ఈ సందర్భంగా పలువురు శేరిలింగంపల్లి సీనియర్ జర్నలిస్టులు టీఎస్ యూడబ్ల్యూజే నుండి టీయూడబ్ల్యూజేలో చేరారు. రాష్ట్ర, జిల్లా నాయకుల సమక్షంలో టీఎస్ యూ డబ్ల్యూజే ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు కే శ్రీనివాస్ గౌడ్, మాజీ ప్రధాన కార్యదర్శి అశోక్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మల్లేష్ తదితరులు టీయూడబ్ల్యూజేలో చేరారు. ఈ సందర్భంగా కొత్తగా యూనియన్ లో చేరిన వారిని శాలువాలతో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మెట్టు జగన్ రెడ్డి, టెంజు సలహాదారుడు రవీందర్ రెడ్డి, ప్రెస్ క్లబ్ మాజీ ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్, కోశాధికారి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు గొడుగు శ్రీనివాస్, సురేష్, ఖదీర్, రాజు, టెంజు అధ్యక్షుడు పి.సాగర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కె. కిషోర్ కుమార్, ప్రధాన సలహాదారులు ఎంఎం బేగ్, మారుతి కుమార్, సహాయ కార్యదర్శులు ఎల్లేష్, రాజేష్ గౌడ్, మల్లేష్ గౌడ్, అనిల్ కుమార్, రాజేష్ లతోపాటు జర్నలిస్టులు సుధాకర్, సతీష్ కుమార్, కృష్ణ సాగర్, రాజు సాగర్, కృష్ణ, ప్రభాకర్ రెడ్డి, హేమంత్ రెడ్డి, రామస్వామి, సత్యం, ఆనంద్ గౌడ్, శర్ఫుద్దీన్, శశిధర్ శాస్త్రి, సురేష్, మహేష్, శివ కుమార్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ కుమార్, కృష్ణ, శైలజ, మల్లేష్, మూర్తి, దేవేందర్, కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here