ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి.. డాక్ట‌ర్ వెంక‌ట్ రెడ్డి..

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైటెక్ సిటీ మాదాపూర్, పర్వత్ నగర్ కమ్యూనిటీ హాల్ లో టి.ఆర్.పి.ఎస్. RMP, PMP. వైద్యుల గ్రేటర్ హైదరాబాద్ ముఖ్యుల సమావేశం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టి.ఆర్.పి.ఎస్. వైద్య సంఘాల ఫౌండర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా. వెంకట్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఆడమ్స్ (ADMS)e Bikes సౌజన్యంతో డైరెక్టర్ శంకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సిబ్బంది నాగార్జున రెడ్డి, సాయి గ్రామీణ వైద్యులకు మధ్యాహ్న భోజన సదుపాయాలు కల్పించారు. డా.వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సమస్య పరిష్కార దిశగా తెలంగాణ సంఘాల ఉమ్మడి వేదిక ద్వారా అతి త్వ‌ర‌గా హైదరాబాద్ లో అన్ని సంఘాల రాష్ట్ర అధ్యక్షులతో, జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి, ఎమ్మెల్సీ కోదండరాం ద్వారా, టి. రమేష్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖమంత్రిని కలసి పూర్తిగా వివరించి, పరిష్కార దిశ‌గా అందరికీ మేలు జరిగే విధంగా పని చేస్తున్నామ‌ని అన్నారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న డాక్ట‌ర్ వెంక‌ట్ రెడ్డి

ఈ కార్యక్రమంలో GHMC. అధ్యక్ష, కార్యదర్శులు, డా.జాఫర్, డా.ఖాన్, డా.శివరాజ్, డా.గణేష్, డా.సునీత, డా. నందిని, డా.రాధిక, డా.జయశ్రీ, డా.సుజాత, డా.నాగమణి, డా.గీత, డా.బేబీ, డా.వసంత, డా. మాధ‌వి,డా.శ్రీనివాస్, డా.భాస్కర్, డా.పాషా, డా.విద్యాసాగర్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here