టీయూడబ్ల్యుజే రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మారుతీ సగరకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సగర సంఘాలు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతీ సగరకు తెలంగాణ సగర సంఘం రాష్ట్ర, గ్రేటర్, జగద్గిరిగుట్ట, అంజయ్యనగర్ సగర సంఘాలు ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాయి. గురువారం నిజాంపేట్ లోని ఆయన నివాసంలో కలిసి శాలువాలతో సత్కరించి పూల బోకేలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, గ్రేటర్ హైదరాబాద్ సంఘం అధ్యక్షులు మోడల రవి సగర, గౌరవాధ్యక్షుడు అస్కాని వెంకటస్వామి సగర, జగద్గిరిగుట్ట సగర సంఘం అధ్యక్షుడు గంగాధర్ సగర, అంజయ్య నగర్ సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు సగర, జగద్గిరిగుట్ట ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ సగర, యువజన సంఘం నాయకులు శివ సగర, చంద్రమోహన్ సగర, శేఖర్ సగర, సంఘం నాయకులు శశిధర్ సగర, జయకృష్ణ సగర, రవి సగర తదితరులు ఉన్నారు.

మారుతీ సగర కు సన్మానించి శుభాకాంక్షలు తెలుపుతున్న సగర సంఘం నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here