ఎమ్మెల్యే గాంధీ రాజీనామా చేయాలి-దళితబంధు ఇప్పించాలి… అంబేద్కర్ విగ్రహానికి బిజెపి దళిత మోర్చా వినతి…

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని దళితులు అభివృద్ధి చెందాలంటే స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ రాజీనామా చేసి ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షల దళిత బంధు వచ్చేలా చూడాలని మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా బిజెపి దళిత మోర్చ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గురువారం వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి గురువారం గాంధీ రాజీనామా చేయాలంటూ వినతి పత్రం సమర్పించారు. దళిత మోర్చ జిల్లా కార్యదర్శి పి.అశోక్, వివేకానంద డివిజన్ బిజెపి అధ్యక్షుడు డి.నర్సింగ్ రావు, జిల్లా మహిళా మోర్చా సెక్రెటరీ విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ హాజరై మాట్లాడారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ సన్యాసుల పార్టీ కాదు, రాజకీయ పార్టీ అంటూ వ్యాఖ్యలు చేస్తూ కెసిఆర్ హుజరాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడానికి, పది లక్షల రూపాయల దళిత బంధు, వేల కోట్ల రూపాయలు అభివృద్ధికి కేటాయించడంలో తప్పేముంది అన్నారని చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గాంధీ కూడా రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు రావడం వస్తే నియోజకవర్గం లోని దళితులకు  సైతం పది లక్షల రూపాయల దళిత బంధు, నియోజకవర్గానికి వేలకోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ రాజీనామా చేయాలని బిజెపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఎస్సీ మోర్చా నాయకులు రమేష్, ఉపేందర్, యాకయ్య, డివిజన్ బిజెపి ఉపాధ్యక్షుడు గణేష్ గౌడ్, దయాకర్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు తిమ్మయ్య, లక్ష్మణ్, బొట్టు శీను, బీజేవైఎం అధ్యక్షుడు సాయి కిరణ్, ప్రధాన కార్యదర్శి సంతోష్, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శులు మమతా, సంధ్య, ఉపాధ్యక్షులు శృతి గౌడ్, సెక్రటరీ భారతీ, గీత, ఉపేంద్ర, కార్యవర్గసభ్యులు శాలిని, సత్య, బిజెపి నాయకులు వెంకటేష్, తిరుపతి రెడ్డి, మహేందర్, శ్రవణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ రాజీనామా చేయాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పిస్తున్న ఎస్సీ మోర్చా నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here