ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసి నగర్ 2 కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీ ఆఫీస్ ను స్ధానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అన్ని కాలనీలు, బస్తీల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు పెద్ద పీట వేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, తెరాస నాయకులు దొడ్ల రామకృష్ణ, రాజేష్ చంద్ర, మధు, బోయ కిషన్, కుమారి, శిరీష తదితరులు పాల్గొన్నారు.