ఇజ్జ‌త్‌న‌గ‌ర్ స్మ‌శాన వాటిక వేలంను ఆపేయాలి… టీఎస్ఐఐసీ జోన‌ల్ మేనేజ‌ర్‌కు బిజెపి నేత‌ల విన‌తి…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ఇజ్జ‌త్‌న‌గ‌ర్ వీక‌ర్‌సెక్ష‌న్ శ్మ‌శాన వాటిక వెలం వేయ‌డాన్ని విర‌మించుకోవాల‌ని కోరుతూ గ‌చ్చిబౌలి కార్పొరేట‌ర్ వి.గంగాధ‌ర్ రెడ్డి, మాదాపూర్ డివిజ‌న్ బిజెపి అధ్య‌క్షుడు గంగల రాధ‌కృష్ణ యాద‌వ్‌లు టీఎస్ఐఐసీ జోన‌ల్ మేనేజ‌ర్ పి.శ్ర‌వ‌న్‌కుమార్‌కు శ‌నివారం విన‌తీ ప‌త్రం అంద‌జేశారు. ఖాన‌మెట్‌ గ్రామ సర్వే నెంబర్ 41/14 లోని ఇజ్జ‌త్‌న‌గ‌ర్ శ్మ‌శాన వాటిక స్థ‌లాన్ని టీఎస్ఐఐసీ ప్లాట్ నెంబర్ 17గా పేర్కొని, వేళం వేస్తున్న‌ట్టు బోర్డును ఏర్పాటు చేయ‌డం ఏంట‌ని రాధ‌కృష్ణ యాద‌వ్‌ ప్ర‌శ్నించారు. ఖానామెట్ ఇజ్జ‌త్‌న‌గ‌ర్ ప‌రిసర ప్రాంతాల్లో 10 వేల‌కు పైగా జ‌నాభ నివాసం ఉంటుంద‌ని, బీసీ, ఎస్‌సీ, ఎస్టీలు ఎవ‌రు మృతిచెందినా గ‌త రెండు ద‌శాబ్ధాలుగా ఇదే స్థ‌లంలో అంత్య క్రియ‌లు చేప‌డుతున్నార‌ని అన్నారు. ఇలాంటి స్మ‌శాన వాటిక‌ను తెలంగాణ ప్రభుత్వం వేలం వేయడం చాల దారుణమని, ప్రజా అవసరాలకు ఉపయోగపడే ఈ స్మశాన వాటిక వేలాన్ని వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. విన‌తీ ప‌త్రం స‌మ‌ర్పించిన వారిలో స్థానిక నాయ‌కులు శ్రీనివాస్ రెడ్డి, బాలకుమర్, హన్మంత్ నాయక్, గురుస్వామి, రంగస్వామి త‌దితరులు పాల్గొన్నారు.

టీఎస్ఐఐసీ జోన‌ల్ మేనేజ‌ర్‌కు విన‌తీ ప‌త్రం అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి, బిజెపి మాదాపూర్ డివిజ‌న్ ఇన్చార్జీ గంగ‌ల రాధ‌కృష్ణ యాద‌వ్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here