నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక కార్పొరేటర్ గంగాధరరెడ్డి జోనల్కమీషనర్ రవికిరణ్‌కు వినతిపత్రం సమర్పించారు. శనివారం జెడ్సీ కార్యాలయంలో రవికిరణ్‌కు కలిసిన గంగాధరరెడ్డి స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. డివిజన్ పరిధిలోని కాంచ గచ్చిబౌలి నవోదయ కాలనీ, ఇందిరా నగర్ లలో సీసీ రోడ్లు, డ్రైనేజి, నీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, వెంటనే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. సమస్యలపై స్పందించిన జడ్సీ పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.