కందుల కూచిపూడి బృంద నృత్యానికి ఆనంద‌ప‌ర‌వశ‌మైన నాట్య‌ప్రియులు

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామంలో వారాంతం, అదేవిధంగా గురు పౌర్ణిమ మహోత్సవాన్ని పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు ఆదివారం అల‌రించాయి. కందుల కూచిపూడి నాట్యాలయం వారు నృత్యప్రదర్శనతో ఆక‌ట్టుకున్నారు. మహాగణపతి, మండోదరి షడం, గరుడ గమన, కొలువై ఉన్నాడేయ్ దేవా దేవుడు, అన్నపూర్ణే విశాలాక్షి, కృష్ణం కలయసఖి, నారాయణీయం, భామాకలాపం, కంజదళయాదాక్షి, ఇందరికి భయము ,వినతో భాగ్యం, థిల్లాన త‌దిత‌ర అంశాల‌ను అద్భుతంగా ఆవిష్క‌రించారు. క‌ళాకారిణిలు హర్షిని, వర్ణిత, సహస్ర, దేవి వైష్ణవి, శ్యామల, మధులిక శ్రీ, నిహిత సాయి, రితిక, లలిత అమృతల ప్ర‌ధ‌ర్శ‌న‌తో నృత్య‌ ప్రియులు ఆనంద ప‌ర‌వ‌శ‌మయ్యారు. గురుపూర్ణిమ నేప‌థ్యంలో నాట్యాల‌య‌ నిర్వాహ‌కులు రవి త‌న‌ శిష్యులతో కలిసి వారి గురువైన వేదాంతం సత్య నరసింహ శాస్త్రి ని ఘనంగా సత్కరించారు.

ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here