నమస్తే శేరిలింగంపల్లి: సమాజంలో శాంతి స్థాపన కోసం దైవం మహమ్మద్ ను ప్రవక్తగా ఎన్నుకున్నాడని, దైవ సందేశాన్ని ప్రజలకు చేరవేయడం ప్రవక్తల బాధ్యత అని దైవ వాణి పంపించిన ప్రవక్త మహమ్మద్ ప్రవక్త అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని ముస్లిం సోదరులంతా కలిసి జరుపుకునే ఈద్ మిలాద్ ఉన్-నబి పండుగ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ తారానగర్ కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ మైనార్టీ నాయకులు అబీబ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు మర్యాదపూర్వకంగా వారిని కలిసి ముస్లిం సంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. మహమ్మద్ ప్రవక్త శాంతి సమాజ స్థాపన కోసం పుట్టిన శుభ సందర్భంగా ముస్లిం సోదరులందరూ ఆయన పుట్టిన రోజును ఈద్ మిలాద్ ఉన్-నబిగా జరుపుకుంటున్నారని అన్నారు. ప్రవక్త ఇచ్చిన సందేశాన్ని, సన్మార్గంనీ ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రభుత్వ విప్ గాంధీ కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు మహ్మద్ ఆబీబ్, ఖాజ పాషా, సలీమ్, జహీర్, మహ్మద్ సహిం, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దొంతి శేఖర్, గోవర్దన్ రెడ్డి, రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.