గచ్చిబౌలి డివిజన్ లో ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు – గులాబీ జెండా ఎగరవేసిన మాజీ కార్పొరేటర్ సాయిబాబా

నమస్తే శేరిలింగంపల్లి: ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు, టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలతో అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తున్నాయని గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం వార్డు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమితి జెండాను గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి కావడం ఆనందంగా‌ ఉందన్నారు. ఎన్నో మైలు రాళ్లను అధిరోహించి నేడు స్వరాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరని అన్నారు. బంగారు తెలంగాణ సాధన దిశగా కేసీఆర్ అడుగుజాడల్లో పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మదురా నగర్, దర్గా జనజీవనం కమిటీ హాల్, ఖాజాగూడ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, గౌలిదొడ్డి, నానక్ రాం గూడ, ఎన్టీఆర్ నగర్, గోపన్ పల్లి, కేశవ్ నగర్, గుల్ మొహర్ పార్కు కాలనీ, నేతాజీ నగర్, హెచ్ సీ యూ టెలికం క్వార్టర్స్, ఇందిరానగర్ బస్టాప్ లలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గచ్చిబౌలి డివిజన్ లో గులాబీ జెండావిష్కరిస్తున్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here