నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. బిజెపి రాష్ట్ర, జిల్లా పార్టీ పిలుపు మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కార్యాలయం వద్ద బిజెపి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించాలని బిజెపి నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని అన్ని డివిజన్లలో డ్రైనేజీ వ్యవస్థను వెంటనే మెగుపర్చాలని, కలుషిత త్రాగు నీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బస్తీలో నీటి పైప్ లైన్లను వెంటనే మెరుగుపర్చాలని, అస్తవ్యస్తమైన రోడ్లు, చెరువుల కబ్జాదారుల నుండి కాపాడాలన్నారు. పారిశుధ్యం, చెత్త కుప్పలు, దోమల బెడద, వీధి లైట్లు, స్మశాన వాటికల ఏర్పాటు, వర్షాకాలం దృష్ట్యా ముంపు ప్రాంతాలను గుర్తించి వెంటనే యుద్ధప్రాతిపదికన సమస్యలను పరిష్కరించాలని చెప్పారు.
అనంతరం సంబంధిత అధికారికి సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, రాష్ట్ర నాయకులు యోగానంద్, మొవ్వ సత్యనారాయణ, రవి కుమార్ యాదవ్, కొరడల నరేష్, ప్రభాకర్ యాదవ్, గంగాధర్ రెడ్డి, నాయకులు బుచ్చిరెడ్డి, డీఎస్ ఆర్ కె ప్రసాద్, అనిల్, రమేష్ సోంశెట్టి, వెంకట్ మారం, రఘునాథ్ యాదవ్, నాగేశ్వర్ గౌడ్, హరికృష్ణ, రాజు శెట్టి, శ్రీధర్ రావు, మాణిక్ రావు, ఆంజనేయులు, రాంరెడ్డి, కృష్ణ, రాఘవేంద్రరావు, రాధాకృష్ణ, ఎల్లేష్, వసంత్ కుమార్ యాదవ్, మేరీ, హరిప్రియ, వినిత సింగ్, విజయ లక్ష్మి, వర లక్ష్మీ, నర్సింహా రావు, లక్ష్మణ్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.