నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి ఆదేశానుసారం చందానగర్ డివిజన్ పరిధిలోని న్యూ పీఏ నగర్ బస్తీ లో బస్తీ అధ్యక్షుడు ప్రొ.పి వై రమేష్ టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బస్తీ ప్రధాన కార్యదర్శి కె.జానకిరామ్, ఉపాధ్యక్షులు మారుతి రావు, కోశాధికారి బి.ఆనంద్, సహాయ కార్యదర్శి జైపాల్ రెడ్డి, ఉప కార్యదర్శులు అర్ గిరి దశరథ్, వర్కింగ్ కార్యదర్శులు నాగేశ్వర రావు, రాములు, వి అర్ రమేష్, విఠలాచారీ, కృష్ణ, టి.శాంతయ్య, ఆంజనేయులు, యూత్ నాయకులు ప్రభాకర్, శంకర్, నరేష్, పి వై రోహన్ తదితరులు పాల్గొన్నారు.