తెరాస స‌భ్య‌త్వ న‌మోదును పెద్ద ఎత్తున చేప‌ట్టాలి: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

వివేకానందనగర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెరాస పార్టీ కార్యాలయంను కార్పొరేటర్ రోజా దేవి రంగరావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. అనంతరం తెరాస నాయకులు, కార్యకర్తలకు గాంధీ సభ్యత్వ న‌మోదు ప‌త్రాలను అంద‌జేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో పార్టీ నాయ‌కులు, కార్య‌కర్త‌ల‌తోపాటు ప్ర‌జా ప్ర‌తినిధులు పెద్ద ఎత్తున స‌భ్య‌త్వాల‌ను న‌మోదు చేయించాల‌ని అన్నారు.

తెరాస పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ రోజా దేవి రంగరావు

రాష్ట్రంలోనే శేరిలింగంప‌ల్లిలో భారీ సంఖ్య‌లో స‌భ్య‌త్వ న‌మోదు చేప‌ట్టి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల‌కు కానుక‌గా ఇవ్వాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ కార్పొరేటర్ రంగరావు, రంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ మాచర్ల భద్రయ్య, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్, రామచంద్ర రావు, ఆంజనేయులు, కొమ్మగాళ్ల మోజేష్, హరినాథ్, బాబురావు, శ్రావణి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చంద్రమౌళి సాగర్, గంగాధర్ సాగర్, సంగి విజయ, రాధాబాయి, శ్యామరాజ్, రాంచందర్, చిన్న హ‌నుమంతు, భారతమ్మ, లక్ష్మమ్మ, నర్సింహులు, కమలమ్మ, రమణా రెడ్డి, నాగరాజ్, సాలయ్య, సత్యనారాయణ, యాదగిరి, శివ సాగర్, శ్రీనివాస్ సాగర్, చిన్న, సోమేశ్, నరేష్, స్వరూప, అరవింద్ పాల్గొన్నారు.

నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు పార్టీ స‌భ్య‌త్వాల‌ను అంద‌జేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ రోజా దేవి రంగరావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here