మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్రనాయక్ తండా కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ చంద్రనాయక్ తండా కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని, కాలనీలో కావల్సిన సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకుడు సాంబశివరావు, కాలనీ ప్రెసిడెంట్ లాలునాయక్, లక్ష్మణ్ నాయక్, రామునాయక్, రవి, శ్రీను, వెంకటేష్ చందర్, సురేష్, రంజిత్, విజయరాం పాల్గొన్నారు.
సమస్యలను పరిష్కరించాలని గోకుల్ ప్లాట్స్ వాసుల వినతి..
మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ వాసులు తమ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ గోకుల్ ప్లాట్స్ కాలనీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు సాంబశివరావు, గుమ్మడి శ్రీను, బ్రిక్ శ్రీను, పితాని శ్రీను, అప్పారావు, పితాని లక్ష్మీ పాల్గొన్నారు.