డ్రైనేజీ స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి: ఉప్పల ఏకాంత్ గౌడ్

వివేకానందనగర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివేకానంద నగర్ డివిజన్ ప‌రిధిలోని వెంకటేశ్వర నగర్ 35వ‌ బ్లాక్ లో బస్తీ దవాఖానాకు ఆనుకుని ఉన్న రోడ్డులో బిజెపి నాయకుడు ఉప్పల ఏకాంత్ గౌడ్ సోమ‌వారం ప‌ర్య‌టించారు. స్థానికంగా 8 ఇంచుల డ్రైనేజీ పైప్‌లైన్లు ఉండడంతో మట్టి మురుగు నిండి పైపులు పగిలి మురుగు నీరు ర‌హ‌దారిపై ప్ర‌వ‌హిస్తుందని స్థానిక బస్తీవాసులు ఫిర్యాదు చేయ‌డంతో ఆయ‌న ఆ ప్రాంతాన్ని ప‌రిశీలించారు. ఇందుకు ఆయ‌న స్పందిస్తూ త‌క్ష‌ణ‌మే డ్రైనేజీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి చిన్న పైప్‌లైన్ తీసివేసి పెద్ద డ్రైనేజీ పైప్ లైన్ వేసే విధంగా అధికారులతో మాట్లాడుతానని బస్తీవాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంతోష్, గణేష్ గౌడ్, వెంకటేష్, తిమ్మయ్య, జితేందర్, శ్రీను, వీరాజు గౌడ్ పాల్గొన్నారు.

డ్రైనేజీ స‌మ‌స్య‌ను ప‌రిశీలిస్తున్న ఉప్పల ఏకాంత్ గౌడ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here