చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎన్నికల ప్రచారంలో తమకు బ్రహ్మరథం పడుతున్నారని చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మంజుల రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ కాలనీ, కేఏస్ఆర్ ఎన్ క్లేవ్, దీప్తి శ్రీ నగర్, శాంతి నగర్, ఆదర్శ నగర్ కాలనీలలో డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాత్ రెడ్డితో కలిసి మంజుల రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాలనీ పాదయాత్రలో టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. మిషన్ భగరీథతో ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తున్నామని, మహిళల భద్రత కోసం షీ టీమ్స్ పనిచేస్తున్నాయని అన్నారు. మహిళల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో గంగారం చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. చందానగర్ డివిజన్ ను అన్నిరంగాల్లోనూ అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో గురుచరణ్ దూబే, ఉరిటి వెంకటరావు, ఓ.వేంకటేష్ రాజు, ధనలక్ష్మి, లక్ష్మినారాయణ గౌడ్, లక్ష్మారెడ్డి, యాదగిరి గౌడ్, రాంచందర్, కరుణాకర్ గౌడ్, రఘుపతి రెడ్డి, మిర్యాల రాఘవరావు, సునీత రెడ్డి, అక్బర్, అంజద్ పాల్గొన్నారు.
