భారతీనగర్(నమస్తే శేరిలింగంపల్లి): జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో భారతీనగర్ డివిజన్ ప్రచార కార్యక్రమంలో అందోల్-జోగిపేట పట్టణ మున్సిపాలిటీ టీఆరెస్ నాయకులు సందడి చేస్తున్నారు. అందోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య ఆధ్వర్యంలో కౌనిల్లర్లు, పార్టీ నాయకులు టిఆర్ఎస్ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

నాయకులు బస్తీల్లో తిరుగుతూ టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని స్థానిక ప్రజలను కోరుతున్నారు. ప్రచార కార్యక్రమంలో మెదక్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పడిగె సత్యం, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ డేవిడ్, కౌన్సిలర్లు చందర్, ఉలువల వెంకటేశం, పిట్ల లక్ష్మణ్, ఖలీల్, దుర్గేష్, నాయకులు రవీందర్ గౌడ్, ఫైజల్, పులుగు గోపి, గాజుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.
